TG Police: పబ్లిక్ పారాహుషార్..! న్యూఇయర్ వేడుకలపై పోలీసుల స్పెషల్ ఫోకస్

by Shiva |
TG Police: పబ్లిక్ పారాహుషార్..! న్యూఇయర్ వేడుకలపై పోలీసుల స్పెషల్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే గస్తీని ముమ్మరం చేసింది. పోలీస్, ఎక్సైజ్, ట్రాఫిక్, టీజీ న్యాబ్ ఇలా అన్నిశాఖలు తమ ఆంక్షలను అమలు చేయబోతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అయ్యారు. వాటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అలాగే.. పబ్స్, హోటల్స్‌పై కూడా ప్రత్యేక నజర్ పెట్టారు. ఇప్పటికే పోలీసు అధికారులు ఈవెంట్ల నిర్వహణపై పలు కీలక ప్రకటనలు చేశారు. అంవాఛనీయ ఘటనలు జరగకుండా ట్రాఫిక్ ఆంక్షలు సైతం అమలు చేస్తున్నారు. ఓఆర్ఆర్‌పై పలు ఆంక్షలు విధించారు. ఎయిర్ పోర్టు వైపు వెళ్లే వారు ఖచ్చితంగా ఫ్లైట్ టికెట్ చూపించాల్సి ఉంటుంది. ప్రతీ మూమెంట్‌ను సీసీ టీవీలతో పర్యవేక్షించనున్నారు.

ఎక్సైజ్ శాఖ టార్గెట్ రూ.1,000 కోట్లు!

ఎక్సైజ్‌తో టీజీన్యాబ్‌ ఇతర నిఘా బృందాలతో తనిఖీలు ఉంటాయని, ఎక్సైజ్‌ శాఖ నుంచి 42 ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు చేశామని ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ ఎన్‌‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌, డ్రగ్స్‌పై, అనుమతి లేని ఈవెంట్‌ పార్టీలపై నిఘా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా రెండు రోజుల్లో ఎక్సైజ్ శాఖ రాష్ర్టవ్యాప్తంగా రూ.1,000 కోట్ల అమ్మకాలు జరిగేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. తెలంగాణ మద్యం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యం వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. మద్యంతోపాటు ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌ వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పబ్బులు, బార్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో జరిగే కొత్త సంవత్సర వేడుకల్లో వినియోగించే మద్యంపై ఎక్సైజ్‌ టీమ్‌లు కొత్త టెక్నాలజీ యాప్‌లతో తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు. రెండు రోజులపాటు మద్యం దుకాణాలు రాత్రి 12 గంటల వరకు, బార్లు పబ్బులకు 1 గంటల వరకు అనుమతులు ఇచ్చారు.

జీరో టాలరెన్స్ డ్రగ్స్

కొత్త సంవత్సరం సందర్భంగా ఈవెంట్స్ నిర్వహించే ఆర్గనైజర్స్‌తో మాదాపూర్ పరిధిలోని ఈవెంట్స్‌పై ఎస్‌ఓటీ డీసీపీ శోభన్ కుమార్ సమావేశం నిర్వహించారు. జీరో టాలరెన్స్ డ్రగ్స్, సౌండ్ పొల్యూషన్, ఫైర్ సెఫ్టీ, ఉమెన్ సెఫ్టీ, టైమ్ షెడ్యూల్, సీసీ టీవీల ఏర్పాటు, అత్యవసర పరిస్థితులలో అప్రమత్తత, క్రౌడ్ మేనేజ్‌మెంట్.. ఇలా పలు అంశాలపై సూచనలు చేశారు.

ట్రాఫిక్ రూల్స్ ఇలా..

- పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలు మినహా ఇతర వాహనాలకు అనుమతి లేదు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మూసివేస్తున్నారు.

- క్యాబ్‌లు/టాక్సీ/ఆటో రిక్షాల డ్రైవర్లు/ఆపరేటర్లు సరైన యూనిఫాంలలో ఉండాలి. వారి వెంట అన్ని పత్రాలను పెట్టుకోవాలి. ప్రజలతో అనుచితంగా ప్రవర్తించకూడదు. అదనపు చార్జీలు డిమాండ్ చేయకూడదు.

- రాంగ్ రూట్లో డ్రైవింగ్, రాంగ్/అనధికార పార్కింగ్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్ వంటి ప్రమాదకరమైన ఉల్లంఘనలను గుర్తించడానికి ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కెమెరాల ద్వారా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారు.

- రాత్రి 8 గంటల నుండి సైబరాబాద్ పరిమితుల్లోని అన్ని రోడ్లలో డ్రంక్, డ్రైవింగ్ విస్తృత తనిఖీలు ఉంటాయి. వాహన డ్రైవర్లు ఆపి పత్రాలను చూపించడంతో పాటు చట్ట ప్రకారం పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలి. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed