సూపర్ సిక్స్ ఫథకాలు.. సంక్రాంతి నుంచి P-4 కార్యక్రమం అమలు

by Mahesh |
సూపర్ సిక్స్ ఫథకాలు.. సంక్రాంతి నుంచి P-4 కార్యక్రమం అమలు
X

దిశ, వెబ్ డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి యేడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలెండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 నగదు. రైతులకు రూ.20 వేలు పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు నగదు తదితర పథకాలను అమలు చేయనున్నారు. అయితే ఇందులో ఉచిత బస్సు ప్రయాణం పై ప్రణాళికలు సిద్ధం అవుతుండగా.. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి కానుకగా లబ్దిదారులకు అందించనున్నట్లు ఇటీవల ప్రకటించారు.

అయితే సూపర్ సిక్స్ ఫథకాలు పథకాల్లోని నాలుగో పథకం(P-4 కార్యక్రమం)అమలకు ప్రభుత్వం ముహుర్తం ఫిక్స్ చేసింది. సంక్రాంతి నుంచి P-4 కార్యక్రమం అమలు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. మచిలీపట్నంలో పర్యటిస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సంక్రాంతి రోజున P-4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న.. పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా P-4 కార్యక్రమం ఉంటుందని, రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల తరహాలో.. స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేస్తామని.. దీని ద్వారా స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed