సింగూరు కు కొనసాగుతున్న వరద...

by Kavitha |
సింగూరు కు కొనసాగుతున్న వరద...
X

దిశ, ఆందోల్: సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు కొనసాగుతున్నది. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు నీటిమట్టం సామర్థ్యానికి చేరుకున్నది. దీంతో అధికారులు బుధవారం సాయంత్రం నుంచి ప్రాజెక్టులోని 6వ నెంబర్ గేటును రెండు మీటర్ల ఎత్తుతో పైకెత్తి 10734 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండగా, జెన్ కో ద్వారా 2822 క్యూసెక్కులు కాగా, మొత్తానికి ప్రాజెక్టు నుంచి దిగువకు 13556 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7263 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దిగువకు నీటిని వదులుతుండడంతో మంజీరా నది పరివాహక ప్రాంత ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చేపలు పట్టేందుకు జాలర్లు నీళ్లలోకి వెళ్లకూడదని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story