PM Kisan:రైతులకు కేంద్ర ప్రభుత్వం దసరా కానుక ..త్వరలోనే పీఎం కిసాన్ నిధుల విడుదల

by Maddikunta Saikiran |
PM Kisan:రైతులకు కేంద్ర ప్రభుత్వం దసరా కానుక ..త్వరలోనే పీఎం కిసాన్ నిధుల విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్:కేంద్ర ప్రభుత్వం(Central Govt) రైతుల కోసం పంట సాయం(Crop Support) కింద ప్రతి సంవత్సరం రూ. 6 వేల ఆర్ధిక సహాయం(Financial Assistance) అందిస్తున్న సంగతి తెలిసిందే.పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) యోజన కింద కేంద్రం ఈ పథకం ప్రయోజనాల్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.ఈ స్కీం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000, అంటే సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మొత్తాన్ని ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి ఇలా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నిధులు జమ చేస్తుంది కేంద్రం.

ఇదిలా ఉంటే..దసరా కానుక(Dussehra Gift)గా కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త(Good News) చెప్పింది. కాగా కేంద్రం ఇప్పటివరకు 17 విడతల వరకు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయగా తాజాగా 18వ విడత నిధుల విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటించింది.ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) 18వ విడుత నిధులను రిలీజ్ చేయనున్నారు.ఈ మేరకు 'ఎక్స్(X)'లో అధికారంగా ప్రకటించింది.పీఎం కిసాన్ పథకం కింద రైతులు డబ్బులు పొందాలంటే ఇ-కేవైసీ(e-KYC) కచ్చితంగా చేయించుకోవాలని సూచించారు.ఒకవేళ ఇంకా ఎవరైనా ఇ-కేవైసీ చేయించుకోకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story