BJP: దేశమంతా విషాదంలో ఉంటే.. రాహుల్‌ గాంధీకి వేడుకలు కావాలా?

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-30 16:03:12.0  )
BJP: దేశమంతా విషాదంలో ఉంటే.. రాహుల్‌ గాంధీకి వేడుకలు కావాలా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడి పదవికే అవమానం కలిగించేలా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల సమయంలో దేశమంతా విషాదంలో ఉంటే.. రాహుల్ గాంధీ మాత్రం కొత్త సంవత్సరం వేడుకల కోసం వియత్నాంకు వెళ్లారని సోమవారం ఒక ప్రకనటలో మండిపడ్డారు. ఇది మన్మోహన్ సింగ్‌ను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ‘క్రిమినల్ బిహేవియర్’ గల వ్యక్తులపై పార్లమెంట్ సభ్యత్వాన్ని నిలిపివేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఓ ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ మీడియా ముఖంగా చించివేసి మన్మోహన్ సింగ్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఎన్వీ సుభాష్ విమర్శించారు.

కాంగ్రెస్ పాలనలో సిక్కు సమాజంపై గౌరవం లేకుండా వ్యవహరించిందని ఎన్వీ సుభాష్ ఆరోపించారు. 1984 ఢిల్లీ అల్లర్లు భారతీయ రాజకీయ చరిత్రలో ఒక కౄరమైన అధ్యాయంగా నిలిచిపోయిందన్నారు. సిక్కులను హత్యచేయడంతో పాటు, సిక్కు సమాజానికి చేసిన అన్యాయం విషయమై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కనీసం బహిరంగ క్షమాపణలు చెప్పకుండా అహంకారంగా వ్యవహరించారని సుభాష్ మండిపడ్డారు. అదేవిధంగా సిక్కుల పవిత్ర స్థలం అయిన గోల్డెన్ టెంపుల్‌పై సైనిక దాడి విషయంలోనూ క్షమాపణ చెప్పలేదని ఆయన గుర్తుచేశారు.


Read More..

Revanth: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు

Advertisement

Next Story

Most Viewed