Lalu prasad : నితీశ్‌కు మా తలుపులు తెరిచే ఉన్నాయి.. లాలూ ప్రసాద్ యాదవ్

by vinod kumar |   ( Updated:2025-01-02 16:15:22.0  )
Lalu prasad : నితీశ్‌కు మా తలుపులు తెరిచే ఉన్నాయి.. లాలూ ప్రసాద్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nithish kumar) కోసం మా తలుపులు తెరిచే ఉన్నాయి. ఆయన కూడా గేట్లు ఓపెన్ చేయాలి. ఎప్పుడైనా మహాఘట్ బంధన్ (Mahagat bandan) కూటమిలో చేరొచ్చు. నితీశ్ కలిసి రావాలి. కలిసి పని చేయాలి’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నితీశ్ తిరిగి రావాలనుకుంటే ఆయనను స్వాగతిస్తామని చెప్పారు. లాలూ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ స్పందించారు. ఈ విషయమై ఓ సమావేశంలో భాగంగా విలేకరులు ఆయనను ప్రశ్నించగా.. ‘మీరు దేని గురించి మాట్లాడుతున్నారు. దానిని వదిలేయండి’ అని చేతులు జోడించి వెళ్లిపోయారు.

దీంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బిహార్‌లో రాజకీయాల్లో బడా భాయ్, ఛోటా భాయ్ అని పిలవబడే నితీశ్, లాలూల మధ్య మరొక కూటమి ఏర్పడే అవకాశం ఉందా అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా, గతంలో ఆర్జేడీతో, నితీశ్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (JDS) పార్టీ రెండు సార్లు పొత్తు పెట్టుకుంది.

Read More ....

Prashanth: బీపీఎస్సీ ఎగ్జామ్ రద్దు చేయాలి.. ప్రశాంత్ కిశోర్ నిరాహార దీక్ష ప్రారంభం


Advertisement

Next Story

Most Viewed