ఆ నలుగురిని ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయడం హర్షణీయం: సీఎం చంద్రబాబు

by Mahesh |   ( Updated:2025-01-02 13:35:35.0  )
ఆ నలుగురిని ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయడం హర్షణీయం: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: గురువారం మధ్యాహ్నం భారత ప్రభుత్వం(Government of India) క్రీడాకారులకు ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న(Major Dhyan Chand Khel Ratna), అర్జున అవార్డులను ప్రకటించింది. కాగా ఈ అవార్డుల ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం తన ట్వీట్‌లో "దేశ ప్రతిష్టను పెంచిన నలుగురు క్రీడాకారులను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయడం హర్షణీయం. ఎయిర్ గన్ షూటింగ్‌లో ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్, భారతీయ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్, హాకీలో ఒలింపిక్ పతక విజేత టీమ్ సభ్యుడు హాకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ పతక విజేత ప్రవీణ్ కుమార్‌లను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. చదరంగంలో బాల్యం నుంచే ప్రతిభ కనబరుస్తూ, చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన గుకేష్ 2024 చెస్ టోర్నమెంట్‌ లో విశ్వ విజేతగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డును అందుకుంటున్న గుకేష్, తన ప్రతిభతో మరింత రాణించాలని కోరుకుంటున్నాను. అలాగే అర్జున అవార్డు గ్రహీతలు విశాఖకు చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ, వరంగల్ కు చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తికి అభినందనలు తెలుపుతున్నాను." అని రాసుకొచ్చారు. కాగా ఈ అవార్డులను ఈ నెల 17న రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) చేతులమీదుగా అందించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed