స్థానిక ఎన్నికలకు సంఘటితంగా పని చేయండి : మంత్రి పొన్నం

by Kalyani |
స్థానిక ఎన్నికలకు సంఘటితంగా పని చేయండి : మంత్రి పొన్నం
X

దిశ, ఎల్కతుర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు దిశగా అందరూ కలిసికట్టుగా పని చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీల్లో ఎక్కువ శాతం అమలు చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం చేసిన ప్రతి పనిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామాల్లో తక్షణం చేయాల్సిన పనులను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని పనులను మనం ఒక సంవత్సరంలోనే చేసి చూపామని కార్యకర్తలకు మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అమలు చేస్తామని వివరించారు. పార్టీ శ్రేణులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, పాక రమేష్, డాక్టర్ రమేష్, అంబాల శ్రీకాంత్ (బక్కి), సంతాజి, గోలి రాజేశ్వరరావు, చల్ల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed