- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించటమే ప్రభుత్వ లక్ష్యం : మునుగోడు ఎమ్మెల్యే
దిశ, చండూరు : విద్యార్థులకు నాణ్యమైన భోజనం పాటు మెరుగైన సౌకర్యాలు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలోని గల బీసీ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలను, తరగతి గదులను, స్టోర్ రూమ్ను, వంటగదిని, బాత్రూంలను, డ్రైనేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లాస్ రూమ్ లో విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు.విద్యార్థులు ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు అని ఆరా తీశారు. భోజనం లోకి ఎటువంటి కూరగాయలు వాడుతున్నారు, నూనె ఏ కంపెనీ వాడుతున్నారు అనే విషయాలు క్షుణ్ణంగా పరిశీలించారు.
వంటగదిలోకి వెళ్లి వండిన అన్నం, కూర, సాంబార్, పెరుగును పరిశీలించారు.పాఠశాల భవనంలో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా కొన్ని మార్పులు సూచనలు చేశారు.విద్యార్థులు చన్నీళ్లతో స్నానం చేస్తున్న విషయాన్ని అధ్యాపకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరలోనే సోలార్ హీటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థును ఉద్దేశించి మాట్లాడుతూ ఐదో తరగతి నుండి అమ్మ నాన్నలను వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి చదువుకుంటున్న మీకు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన భోజనం అందించడం మాపైన మా ప్రభుత్వం పైన ఉందని అన్నారు.
తప్పకుండా రాబోయే రోజుల్లో బోడంగిపర్తి పాఠశాల లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని.. మీరందరూ బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా గురుకులాలలో టీచింగ్ స్టాఫ్, హాస్టల్ స్టాఫ్, వేరు వేరుగా ఉండే విదంగా చర్యలు తీసుకునేదుకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని అన్నారు.కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కోరిమి ఓంకారం,నాయకులు పల్లె వెంకన్న,దోటి వెంకన్న,సుజావుద్దీన్, సాపిడి రాములు,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగస్వామి, బురకల ఎలక్షన్ తదితరులు పాల్గొన్నారు.