బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి : నల్లగొండ ఎస్పీ

by Aamani |
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి :  నల్లగొండ ఎస్పీ
X

దిశ, నల్లగొండ క్రైం: నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరికి గురవుతున్న బాల బాలికలను గుర్తించి వారిని సంరక్షించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి జనవరిలో ఆపరేషన్ స్మైల్, జులైలో ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్మైల్-11 సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ డివిజన్ పరిధిలో మూడు టీంలుగా ఏర్పాటు చేసి ఆపరేషన్ నిర్వహిస్తామని చెప్పారు.

18 ఏండ్ల లోపు తప్పిపోయిన, వదిలివేయబడిన, వివిధ రకాల బాల కార్మికులు కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, వివిధ కంపెనీల్లో పని చేస్తూ, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాల కార్మికులుగా ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపిస్తామని చెప్పారు. పరిశ్రమలు, బ్రిక్స్ తయారీ, హోటల్స్, లాడ్జ్, మినరల్ వాటర్ సప్లై, దుకాణాలు, ధాబాలు ఇలా ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరీ కి గురైతే సంబంధిత యాజమాన్యాలపై కేసులు నమోదు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కృష్ణవేణి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed