- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Interesting Features:వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. వీడియో కాల్స్‌కు ఫిల్టర్ ఎఫెక్ట్స్!?
దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత జనరేషన్‌లో మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక మొబైల్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఫోన్ ద్వారా ప్రపంచంలో జరిగే సంఘటనలు తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. మొబైల్ లో అందరు ఎక్కువ యూస్ చేసే వాట్సాప్ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. చాలామంది మొబైల్ యూజర్లు వాట్సాప్‌ని ఎక్కువ వినియోగిస్తుంటారు. వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్, అడియో కాల్, స్టేటస్, వాట్సాప్ ప్రొఫైల్ ఇలా అన్ని ఫీచర్లతో Whatsapp App యూజర్లను ఆకట్టుకుంటుంది. అయితే ప్రజెంట్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో తీసుకొస్తోంది. తాజాగా వాట్సాప్ Video Calls కోసం కొత్త కెమెరా ఫిల్టర్‌లు, బ్యాక్‌గ్రౌండ్ వంటి కొత్త ఆప్షన్‌లను తీసుకొచ్చింది. ఇప్పుడు యూజర్లు తమ బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చుకోవడంతో పాటు వీడియో కాల్ సమయంలో ఫిల్టర్‌ని యాడ్ చేసుకోవచ్చు.
వీడియోలకు ఫిల్టర్ ఎఫెక్ట్ కోసం వార్మ్, కూల్, బ్లాక్ అండ్ వైట్, డ్రీమీ మరిన్ని ఆప్షన్లతో సహా 10 ఫిల్టర్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఫిల్టర్‌లో మీకు నచ్చిన మూడ్‌ని ఎంచుకోవచ్చు. వీడియో కాల్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ క్రియేట్ చేసేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుందంట. ఇక బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్ విషయానికి వస్తే మీరు వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో మీ బ్యాక్ కనిపించే వాటిని ఈజీగా మార్చుకోవచ్చు. సరికొత్త లొకేషన్ ఉన్నట్టుగా డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవచ్చు. అలాగే బ్లర్ ఎఫెక్ట్ వంటి ఆప్షన్ కూడా ఉన్నాయి. వాట్సాప్ టచ్ అప్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ మీ రూపాన్ని మరింత అట్రాక్షన్‌గా ఉండేలా చేస్తుంది. వీడియో కాల్ సమయంలో ఈ ఫీచర్‌లను స్క్రీన్‌పై రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న ఎఫెక్ట్స్ ఐకాన్ ట్యాప్ చేయండి. అందుబాటులో ఉన్న ఆప్షన్ ద్వారా బ్రౌజ్ చేయండి. మీరు 1:1 కాల్‌లో ఉన్నా లేదా గ్రూప్ వీడియో చాట్‌లో ఉన్నా, ఈ ఎఫెక్ట్‌లను యాక్సెస్ చేయొచ్చు. ఈ కొత్త అప్‌డేట్‌లు త్వరలో వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నాయి.