ఢిల్లీ పోలీసుల పేరుతో మోసం..

by Naveena |
ఢిల్లీ పోలీసుల పేరుతో మోసం..
X

దిశ, కామారెడ్డి : 'ఢిల్లీ పోలీసులం మాట్లాడడుతున్నాం.. డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో ఉన్నావు...నిన్ను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ పోలీసులు వస్తున్నారు' అని సైబర్ మోసగాళ్ళు కామారెడ్డి పట్టణానికి చెందిన కిషన్ రావు అనే వ్యక్తికి ఫోన్ చేశారు. మరుసటి రోజు ఫోన్ చేసి అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని డబ్బులు పంపండి..కేసు ముగిసిన తర్వాత తిరిగి ఇచ్చేస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు. దీంతో డబ్బులు ఇవ్వకపోతే నిజంగానే అరెస్ట్ చేస్తారేమోనని భయపడిన బాధితుడు ఫోన్ చేసిన వ్యక్తులకు నాలుగు విడతలుగా 9,29,000 సైబర్ నేరగాళ్ల అకౌంట్ కు బదిలీ చేశాడు. తర్వాత ఇది మోసమని గ్రహించి 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి కేసులలో ఉన్నారని, కేసులను తీసివేయాలంటే డబ్బులు వేయాలని అడిగితే ఇవ్వొద్దని కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అలాంటి ఫోన్లు వస్తే వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేదా 1930 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

Next Story

Most Viewed