- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: ఏమైనా అప్‌డేట్ ఉందా?.. ఈడీకి కేటీఆర్ సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులకు బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన ట్వీట్ పెట్టారు. తెలంగాణ రెవెన్యూ మంత్రి ఇల్లు, కార్యాలయాల్లో దాడులు చేసి 60 రోజులు దాటింది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. దాడులకు సంబంధించి ఒక్క ఫొటో, ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు. అసలు లోపలికి వెళ్లిన రెండు కరెన్సీ లెక్కింపు యంత్రాలు ఏమయ్యాయి? అని ఈడీ అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు. ఈ నిశ్శబ్దం ఎందుకని అడిగారు. కాగా, గతంలో కస్టమ్స్ సుంకం ఎగవేత, మనీ లాండరింగ్ కేసుల నేపథ్యంలో ఈడీ అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం ఢిల్లీ నుంచి 16 ఈడీ బృందాలు హైదరాబాద్‌కు చేరుకుని.. ఏకకాలంలో హైదరాబాద్, ఖమ్మంలోని 15 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు వార్తలు వినిపించాయి.