బతుకమ్మ వేడుకలో విషాదం... మహిళ మృతి

by Sridhar Babu |
బతుకమ్మ వేడుకలో విషాదం... మహిళ మృతి
X

దిశ, ముత్తారం : బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు ఆడుతూపాడిన మహిళ ఒక్కసారిగా కుప్పకూలింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని లక్కారంలో బుధవారం రాత్రి బతుకమ్మ ఆడుతుండగా మాదాసి స్వరూప (40) అకస్మాత్తుగా చాతి నొప్పి రావడంతో కుప్పకూలింది. అక్కడికక్కడే మృతి చెందింది. దాంతో ఒక్కసారిగా లక్కారంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed