- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Biden: అణు కేంద్రాలపై దాడులకు మద్దతివ్వబోము.. యూఎస్ అధ్యక్షుడు బైడెన్
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ దేశ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడబోతుందనే కథనాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి తాము మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. అయితే ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తామని తెలిపారు. ఈ మేరకు ఈ పశ్చిమాసియాలో ఏర్పడిన సంక్షోభం దృష్యా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని బుధవారం జీ-7 దేశాల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లోనే బైడెన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బైడెన్ తో పాటు జీ-7 దేశాలు సైతం ఇరాన్ దాడిని ఖండించాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరాయి. దౌత్యపరమైన పరిష్కారం ఇప్పటికీ ఆచరణలోనే ఉందని తెలిపాయి. ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందించే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని, కానీ అణు కేంద్రాలపై దాడులు సరికాదని స్పష్టం చేశాయి. ఈ విషయమై త్వరలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడతానని బైడెన్ తెలిపారు.