- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో మరో సైబర్ మోసం.. ముగ్గురు కేటుగాళ్ల అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో మరో సైబర్ మోసం(Cyber Fraud) వెలుగులోకి వచ్చింది. సైబర్ మోసాలపై పోలీసులు ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సైబర్ ముఠాకు బ్యాంక్ అకౌంట్ నెంబర్లను హైదరాబాద్‌కు చెందిన ఉదయ్ కిరణ్, రామిరెడ్డి, చంగల్ రాయుడు ఇస్తున్నట్లు గుర్తించారు. విశాఖకు చెందిన వ్యక్తి నుంచి రూ. 16 లక్షలు కొట్టివేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఫోన్ నెంబర్ సేకరించిన సైబర్ కేటుగాళ్లు.. విశాఖకు చెందిన వ్యక్తికి ఫోన్ చేశారు. మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తామంటూ బాధితుడిని బెదిరించారు. అలా బాధితుడి నుంచి రూ. 16 లక్షలు కొట్టేశారు. దీంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం కోర్టులో ప్రవేశ పెడతామని పోలీసులు తెలిపారు.