నవరాత్రి ఉత్సవాల్లో ప్రజల భద్రత కోసం 3డి, AI కెమెరాలు.. ఎక్కడంటే..?

by Mahesh |
నవరాత్రి ఉత్సవాల్లో ప్రజల భద్రత కోసం 3డి, AI కెమెరాలు.. ఎక్కడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: వినాయక చవితి ముగిసి 20 రోజులు గడవక ముందే దేశంలో మరో పెద్ద పండుగ వచ్చింది. దేశవ్యాప్తంగా గురువారం నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం నిర్వహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా ఈ దేవి నవరాత్రి ఉత్సవాలు గుజరాత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు. అహ్మదాబాద్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్‌తో కలిసి, ప్రజల భద్రత, కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు అధునాతన భద్రతా ప్రణాళికను ప్రవేశపెట్టారు. నవరాత్రులకు అహ్మదాబాద్ నగరం అంతా భారీ సంఖ్యలో జనాలను ఆకర్షిస్తాయి. దీంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఉంచాలని కోరారు. దీంతో అహ్మదాబాద్‌ నగరంలో మొత్తం 3,000 CCTV కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో ట్రాఫిక్ నిఘా కెమెరాలు, నిర్భయ ప్రాజెక్ట్ కెమెరాలు, స్మార్ట్ సిటీ CCTV వ్యవస్థలు, అదనపు పోర్టబుల్ కెమెరాలు ఉన్నాయి.

రద్దీగా ఉండే ప్రాంతాలను నిశితంగా పరిశీలించేందుకు కీలకమైన ప్రాంతాల్లో 300కు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. పోలీసులు సమగ్ర కవరేజీ కోసం షాపులు, హోటళ్లు, రెస్టారెంట్ల కెమెరా నెట్‌వర్క్‌లను సిటీవైడ్ సిస్టమ్‌లో ఏకీకృతం చేశారు. ఈవెంట్ నిర్వాహకులు తమ సొంత కెమెరాలను వేదికల వద్ద ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.భద్రతను పటిష్టం చేసేందుకు ప్రత్యేకించి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లపై దృష్టి సారించారు. ఈ ఏర్పాట్లపై అహ్మదాబాద్ ప్రత్యేక కమిషనర్ అజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. అహ్మదాబాద్ లో భారీ ఎత్తున జరిగే.. నవరాత్రి ఉత్సవాలను 3,000 కంటే ఎక్కువ కెమెరాలు పర్యవేక్షిస్తాయి. నగరం అంతటా బహిరంగ ప్రదేశాలు నిఘా ఏర్పాటు చేశాము. అదనంగా, 20 పోర్టబుల్ కెమెరాలు 3D మ్యాపింగ్‌తో అమర్చబడ్డాయని, కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతతో కూడిన కెమెరాలను ఏర్పాటు చేశామని.. ఇవి ఎవరైనా అనుమానంగా వ్యవహరిస్తే వెంటనే అలర్ట్ జారీ చేస్తాయని పేర్కొన్నారు.

Next Story