- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త సంవత్సర వేడుకలకు గోవా మద్యం… 95 మద్యం బాటిళ్లు స్వాధీనం
దిశ ప్రతినిధి వికారాబాద్ : కొత్త సంవత్సరం వేడుకల కోసం కొందరు వ్యక్తులు గోవా నుంచి పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను రవాణా చేస్తున్నారు అని నమ్మదగిన సమాచారం మేరకు వికారాబాద్ ఎక్సైజ్ పోలీసులు వాస్కోడిగామా రైల్లో శనివారం తెల్లవారు జామున దాడులు నిర్వహించి 95 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు రానున్న కొత్త సంవత్సర వేడుకల కోసం మద్యం కొనుగోలుకు గోవా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గోవాలో మద్యం కొనుగోలు చేసుకొని వాస్కోడిగామా రైల్లో హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న రంగారెడ్డి డివిజన్‌లోని వికారాబాద్ ఎక్సైజ్ ఎక్సైజ్ సూపరిండెంట్ విజయభాస్కర్, డిటిఎఫ్, ఎక్సైజ్ ఎస్సైలు ప్రేమ్‌రెడ్డి, వీరాంజనేయులు సిబ్బంది రైలు వికారాబాద్ స్టేషన్ కు చేరుకోగానే తనిఖీలు చేపట్టారు. రైల్లోలోని నాలుగు బోగీల్లో దాడులు నిర్వహించి రూ.1లక్ష విలువ చేసే 95 గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను పట్టుకున్న వికారాబాద్ ఎక్సైజ్ పోలీసులకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్ రెడ్డి, రంగారెడ్డి డిప్యూటి కమిషనర్ పి.దశరథ్ లు అభినందనలు తెలిపారు.