- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
137 కిలోల గంజాయి,5 గంజాయి మొక్కలు దహనం
దిశ, కామారెడ్డి : జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన 137 కిలోల ఎండు గంజాయి, 5 గంజాయి మొక్కలను అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నరసింహారెడ్డి పర్యవేక్షణలో బుధవారం దహనం చేసినట్లు జిల్లా ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. కామారెడ్డి టౌన్ , దేవునిపల్లి, రాజంపేట, గాంధారి, సదాశివనగర్, నసరూళ్ళబాద్, పెద్ద కొడపగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 15 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్తులను గతంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఠాణాల్లో నిల్వ ఉన్న గంజాయిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్వీర్యం చేశామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు, డిసిఆర్బి డిఎస్పి మదర్ లాల్, సిఐలు తిరుపయ్య, శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.