- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Truths of life: వీటిని లైట్ తీసుకుంటున్నారా..? లైఫ్ రిస్క్‌లో పడుతుంది జాగ్రత్త!
దిశ, ఫీచర్స్: జీవితం ఎంతో విలువైందని పెద్దలు చెప్తుంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు. అలాగే మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి అలవాట్లు రోజువారీ జీవితంలో ముఖ్యమని అంటుంటారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే లేదా ఏం అవుతుంది లే అని లైట్ తీసుకుంటే ఆనందం, ఆరోగ్యం దూరం అవుతాయని, చేస్తే లైఫ్ రిస్క్‌లో పడుతుందని నిపుణులు సైతం అంటున్నారు. అలాంటి ముఖ్యమైన కొన్ని విషయాల గురించి ఇప్పపుడు తెలుసుకుందాం.
ఆహారాలు - ఆరోగ్యం
కొన్ని రకాల ఆహారాలు ఆరోగ్యానికి మంచివి. అలాగే హానికలిగించేవి కూడా ఉంటాయి. కానీ కొందరు వీటిని మానుకోవడంలో లేదా తగ్గించడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా లైట్ తీసుకునే ధోరణి హెల్త్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ వల్ల శరీరంలో పోషకాల లోపాలు ఏర్పడతాయి. బరువు పెరుగుతారు. అధిక రక్తపోటు సమస్యకు కారణం అవుతుంది. అయినా ఈ అలవాటును మార్చుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు కొందరు. అలా అయితే జీవితం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి కూరగాయలు, ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ ఉండే బ్యాలెన్స్‌డ్ డైట్ ఫాలో అవ్వాలి.
నీరు, శారీరక శ్రమ
ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. కానీ రోజూ కనీసం ఏడెనిమిది గ్లాస్‌ల నీరు తాగడానికి నిర్లక్ష్యం చేస్తుంటాం. సమయం ఉన్నా వ్యాయామాలు చేయకపోవడం, శారీరక శ్రమ కలిగి ఉండే పనులు చేయకవడం వంటివి కంటిన్యూ చేస్తుంటాం. ఈ అలవాట్లును లైట్ తీసుకుంటే డేంజర్లో పడతార. మధుమేహం, గుండె జబ్బులు, ఇతర రోగాలు దాడిచేస్తాయి. కండరాల బలహీనత ఏర్పడుతుంది. తగినంత నీరు తాగకపోతే కూడా అలసట వేధిస్తుంది. తలనొప్పి, జీర్ణక్రియ సమస్యలు, డీహైడ్రేషన్, మూత్రపిండాల వైఫల్యం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి నీరు తాగడం, ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండటం వంటివి ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. డైలీ వాకింగ్, రన్నింగ్, స్ట్రెచింగ్ తదితర వ్యాయామాలు చేయడం మీ లైఫ్ క్వాలిటీని పెంచుతుంది.
ప్రతికూల ఆలోచన, స్కిన్ కేర్
నిజానికి మీరు ఆలోచించే తీరు మిమ్మల్ని నడిపిస్తుంది. మీ మనసు సానుకూల ఆలోచనలతో నిండి ఉంటే సంతోషంగా ఉంటారని, సక్సెస్ సాధిస్తారని నిపుణులు చెప్తున్నారు. ఇది పట్టించుకోకుండా ప్రతీ విషయంలో అతిగా లేదా ప్రతికూలంగా ఆలోచించడం మీ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. నెగెటివ్ థింకింగ్ వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ పెరిగిపోతాయి. పాజిటివ్‌గా ఆలోచిస్తే మొత్తం మీ శ్రేయస్సును మెరుగు పరుస్తుంది. ఆలోచనతో పాటు అదం, చర్మ సంరక్షణ వంటి విషయాలు కూడా ప్రాధాన్యత కలిగినవే. వీటిని లైట్ తీసుకుంటే త్వరగా వృద్ధాప్య ఛాయలు రావచ్చు. నిజానికి వాతావరణంలోని హానికరమైన ఎలిమెంట్స్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చర్మ సంరక్షణ కూడా చాలా ముఖ్యం. కాబట్టి పరిశుభ్రత, చర్మ సంరక్షణను లైట్ తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు.
టైమ్‌కు తినకపోవడం - భావోద్వేగాలు
ఆరోగ్యానికి, ఆనందానికి ఆహారం చాలా ముఖ్యం. అయితే అది సరైన సమయానికి తీసుకోవడం ఇంకా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. ఇర్రెగ్యులర్ ఫుడ్ హాబిట్స్ బాడీలో నేచురల్ రిథమ్‌ని డిస్టర్బ్ చేస్తాయని, తద్వారా శారీరక, మానసిక అనార్యోగ్యాలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. రాత్రిళ్లు ఆలస్యంగా తినడం లేదా అధికంగా ఉపవాసాలు చేయడం కూడా అధిక బరువు, జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి వీటిని ఎప్పుడూ లైట్ తీసుకోకండి. నిద్రను, భావోద్వేగాల నిర్వహణను నిర్లక్ష్యం చేసినా లైఫ్ రిస్క్‌లో పడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. క్రమంగా అది ఊబకాయం, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీసి ప్రాణాంతకం కావచ్చు.
స్వీయ నియంత్రణ - స్ట్రెస్ మేనేజ్‌మెంట్
ఆయా సందర్భాల్లో ఇబ్బందులను అధిగమించడంలో స్వీయ నియంత్రణను కీ రోల్ పోషిస్తుంది. అది లేకపోతే మీరు అధిక ఒత్తిడికి గురవుతారు. క్రమంగా అది క్రానిక్ స్ట్రెస్‌కు దారితీస్తుంది. దీంతో కార్టిసాల్ లెవల్స్ పెరిగి, రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. గుండె జబ్బులు రిస్క్ పెరుగుతుంది, నిరాశ ఆవహిస్తుంది. ఇవన్నీ మీ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాయి. కాబట్టి వ్యాయామం, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్స్ వంటి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ యాక్టివిటీస్ ఏర్పర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు మీ సమస్యలకు ఇతరులను నిందించడం, బాధ్యులను చేయడం వంటి అలవాట్లను మార్చుకోవాలి. కొత్త విషయాలను నేర్చుకోవడం, నైపుణ్యాలు అలవర్చుకోవడం కొనసాగించాలి. వీటిని ఏమాత్రం లైట్ తీసుకున్నా లైఫ్ రిస్క్‌లో పడదన్న గ్యారెంటీ ఏమీ లేదంటున్నారు నిపుణులు.