ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధ మేఘాలు.. భయం గుప్పిట్లో తెలుగువారు

by M.Rajitha |
ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధ మేఘాలు.. భయం గుప్పిట్లో తెలుగువారు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వలన పశ్చిమాసియా దేశాలు రణరంగంగా మారాయి. ఇరాన్ అకస్మాత్తుగా భారీ క్షిపణులతో ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది. త్వరలోనే ఇజ్రాయెల్ ప్రధానిని చంపేస్తాం అని వార్నింగ్ ఇచ్చింది. దీనిపై ఆగ్రహించిన ఇజ్రాయెల్ ఇరాన్ మీద వైమానిక దాడులు జరుపుతూ ప్రతీకారం తీర్చుకుంటోంది. కాగా ఈ మొత్తం వ్యవహారంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచించింది. అయితే ఇరాన్ జరుపుతున్న ఈ ఆకస్మిక దాడుల వలన ఇజ్రాయెల్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. ఊహించని యుద్ద పరిణామానికి తీవ్ర భయాందోళనకు గురవుతున్న తెలుగువారు.. తమను ఇక్కడి నుండి ఇండియాకు తరలించే ఏర్పాట్లు చేయాలని భారత ఎంబసీకి భారీగా వినతులు, కాల్స్ చేస్తున్నారు. కాగా ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అన్ని రకాల విమాన సర్వీసులను ఇజ్రాయెల్ నిలిపి వేసింది. అలాగే ఇజ్రాయెల్ మీదుగా వెళ్ళే అన్ని విమాన సర్వీసులను విమాన సంస్థలు రద్దు చేశాయి.

Next Story