Tripti Dimri : వివాదంలో నేషనల్ క్రష్.. స్పందించిన టీమ్

by sudharani |   ( Updated:2024-10-02 15:03:18.0  )
Tripti Dimri : వివాదంలో నేషనల్ క్రష్.. స్పందించిన టీమ్
X

దిశ, సినిమా: ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది త్రిప్తి దిమ్రి. దీంతో ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తుంది. అలాగే కుర్రోళ్ల హృదయాల్లో నేషనల్ క్రష్ అనే ట్యాగ్ వేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ‘ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ’లోని కొందరు మహిళా పారిశ్రామికవేత్తలు ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ ఇటీవల త్రిప్తి దిమ్రికి రూ. 5 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. కానీ.. కొన్ని అనివార్య కారణాల చేత త్రిప్తి ఈ ఈవెంట్‌కు హాజరుకాలేదు. దీంతో కోపం తెచ్చుకున్న మహిళలు.. త్రిప్తి తీరుపై మండిపడుతూ భవిష్యత్తులో ఆమె సినిమాలు బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారు. అంతే కాకుండా ఈ ఈవెంట్‌లో ఏర్పాటు చేసిన హీరోయిన్ పోస్టర్లను కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే.. తాజాగా ఈ ఇష్యూపై త్రిప్తి దిమ్రి టీమ్ స్పందించింది.

‘ప్రజెంట్ త్రిప్తి తన నెక్స్ట్ సినిమా ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈవెంట్స్, ఇంటర్వ్యూలకు హాజరవుతూ వృత్తిపరమైన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ తప్పితే.. మరి ఏ ఇతర ఈవెంట్స్‌లో ఆమె పాల్గొనడం లేదు. అలాగే ఇలాంటి వాటికి సంబంధించి డబ్బులు కూడా తీసుకోవడం, అదనంగా వసూలుచేయడం వంటివి చేయలేదు’ అని ‘X’ వేదికగా చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story