- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పట్టణాల నుంచి పల్లెలకు పాకిన గంజాయి.. గుట్టు చప్పుడు కాకుండా సరఫరా..
దిశ, లింగాల ఘణపురం: గాంజాయి చాప కింద నీరుల విస్తరిస్తుంది. తొలుత సరదా కోసం మత్తు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్న యువత తక్కువ ఖర్చుతో ఎక్కువ కిక్ రావడంతో వ్యసనానికి బానిసలు అవుతున్నారు. ఎక్కువ శాతం చదువుకునే విద్యార్థులే గాంజాయి కు అలవాటు పడుతున్నారు. లింగాల ఘణపురం మండలంలోని నెల్లుట్ల, కుందారం, కళ్లెం, కొత్తపల్లి, వడ్డిచర్ల, లింగాల ఘణపురంతో పాటు పలు గ్రామాలలో యువత, కార్మికులు, విద్యార్థులు గుట్టు చప్పుడు కాకుండా గాంజా పేపర్లు వినియోగిస్తూ గంజాయిని సేవిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. జిల్లా కేంద్రం నుంచి గాంజా రోలింగ్ పేపర్, గంజాయి తీసుకువచ్చి గ్రామాల్లో సేవిస్తూ విక్రయిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. గ్రామాలలో ఒక గ్రూపుగా ఏర్పడి జన సంచారం లేని ప్రాంతాలలో చెట్ల కింద కూర్చొని మొబైల్ ఫోన్లు చూస్తూ గుట్టు చప్పుడు కాకుండా గంజాయి దమ్ము కొడుతున్నారు. తల్లిదండ్రులకు ఎవరికి అనుమానం రాకుండా సాయంత్రం వరకు అక్కడే గడుపుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
గుట్టు చప్పుడు గ్రామాలకు సరఫరా..
పట్టణాలకే పరిమితమైన గంజాయి నేడు పల్లెలకు చేరింది. గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని జిల్లా కేంద్రం నుంచి వాహనాల్లో తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రానికి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులతో కూడా గ్రామాలకు సరఫరా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. 15, 16 సంవత్సరాల పిల్లలు కూడా గంజాయిని సేవిస్తున్నారంటే పల్లెల్లో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థమవుతుంది. ఎక్కువ శాతం చదువుకునే విద్యార్థులే గాంజా కు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రుల వద్ద కళాశాలలో పైసలు చెల్లించాలని మభ్యపెడుతూ డబ్బులు తీసుకువచ్చి గాంజా కొనుగోలు చేసి మత్తులో మునిగితేలుతున్నారు. కళాశాలలో ఉపాధ్యాయులపై కూడా గాంజా మత్తులో కొంతమంది తిరగబడుతున్నారని సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే భావితరాల భవిష్యత్తు అంధకారమవుతుందని, ప్రభుత్వం గాంజాను నిర్మూలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, గంజాను సరఫరా చేసే వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
తల్లిదండ్రులు దృష్టి సారించకపోతే ప్రమాదమే..
రెక్కాడితే గాని డొక్కాడని రైతన్నలు కాయ కష్టం చేస్తూ తమ పిల్లలను ప్రయోజకులు చేయాలని పాఠశాలకు, కళాశాలలకు పంపిస్తున్నారు. అయితే పిల్లలు తల్లిదండ్రుల కళ్ళుగప్పి గంజాయి మత్తు వైపు మొగ్గు చూపిస్తున్నారు. గంజాయి మెదడు పై ప్రభావం చూపుతుందని, మత్తు పదార్థం సేవించగానే సైకోగా మారే ప్రమాదం ఉంటుందని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు. టెక్నాలజీకి బానిసలు అవడంతో పాటు, చెడు వ్యసనాలకు అలవాటు పడి యువత వారి బంగారు భవిష్యతును కాల రాసుకుంటున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో నిరంతరం వారిని గమనిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని కోరుతున్నారు.
గ్రామాల్లో పోలీసులు నిఘా పెట్టాలి..
గాంజాను అరికట్టేందుకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ గ్రామాలపై నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని పెద్ద గ్రామ పంచాయతీలలో ఎక్కువ మంది గాంజాకు బానిసలుగా మారారని, గ్రామాలలో గాంజాను సరఫరా చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గంజాయి వాడకం వల్ల వచ్చే దుష్ఫలితాలను వివరిస్తూ గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
గంజాయి విక్రయించినా, సేవించినా చర్యలు..
గంజాయి సరఫరాపై నిఘా పెట్టాం. గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించి సమాచారం తీసుకుంటున్నాం. ఎవరైనా గంజాయి సేవించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవు. ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నా, సేవిస్తున్నా వెంటనే పోలీసులకు సమచారం అందించండి. వెంటనే చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ రాజు తెలిపారు.