Minister Gottipati: జగన్ వల్లే ఏపీలో విద్యుత్ వ్యవస్థ నాశనమైంది: మంత్రి గొట్టిపాటి ఫైర్

by Shiva |
Minister Gottipati: జగన్ వల్లే ఏపీలో విద్యుత్ వ్యవస్థ నాశనమైంది: మంత్రి గొట్టిపాటి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం జగన్ (Former CM Jagan) వల్లే ఏపీలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Miniser Gottipati Ravi Kumar) ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ (Jagan) ప్రజలపై విద్యుత్ చార్జీల పేరుతో రూ.18 వేల కోట్ల మేర భారం మోపారని ఆయన ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం కారణంగా విద్యుత్ శాఖ (Electricity Department)పై రూ.1.30 లక్షల కోట్ల మేర భారం పడిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు వసూలు చేస్తున్నవి సర్దుబాటు చార్జీలు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో తాము విద్యుత్ చార్జీలను (Electricity Charges) పెంచడం లేదని మరోసారి స్పష్టం చేశారు. విద్యుత్ హెచ్చుతగ్గులతో ఏపీ జెన్కో‌ (AP GENCO)ను ముంచేసింది జగనే అని ఆరోపించారు. 2022-23, 23-24 ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రజలపై మోపాలని డిస్కంలకు అనుమతి ఇచ్చింది ఆయన కాదా అని పశ్నించారు. నాడు టీడీపీ అధికారంలో ఉన్న నాటు రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదని గుర్తు చేశారు. కరెంట్ చార్జీల పెంపుపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ గొట్టిపాటి రవికుమార్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed