- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ కారేసింగ్‌లో కోట్ల రూపాలయ స్కాం.. రంగంలోకి ఏసీబీ..!
దిశ, తెలంగాణ బ్యూరో: ఇన్నాళ్లు కామ్‌గా ఉన్న ఫార్ములా ఈ-కారు రేసింగ్ వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. నిధుల కేటాయింపులో జరిగిన గోల్‌మాల్‌పై విచారణ చేయాలని ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. దీనితో రెండు మూడు రోజుల్లో ఏసీబీ ఆఫీసర్లు రంగంలోకి దిగే చాన్స్ ఉంది. అయితే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉండటంతో, విచారించేందుకు పర్మిషన్ కోరుతూ చీఫ్ సెక్రెటరీకి ఏసీబీ లేఖ రాసినట్టు తెలుస్తున్నది. సాధ్యమైనంత త్వరగా ఏసీబీ రిక్వెస్ట్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించవచ్చని సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఏసీబీకి అప్పగించడంపై ఆసక్తి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఫార్ములా ఈ-కారు రేసింగ్ వివాదం బహిర్గతమైంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఈ-కారు రేసింగ్ నిర్వహణ సంస్థకు మున్సిపల్ శాఖ రూ.55 కోట్లు కేటాయించడం వివాదంగా మారింది. దీనిపై శాఖాపరమైన విచారణ చేయగా, అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రమేయం ఉన్నట్టు తేలింది. వెంటనే ఆయన్ను మున్సిపల్ శాఖ నుంచి బదిలీ చేసి, అంతగా ప్రాధాన్యం లేని విపత్తుల శాఖ బాధ్యతలు అప్పగించారు. గత ఆరునెలలుగా ఈ వివాదం జోలికి ఎవరూ వెళ్లలేదు. కాని సడెన్‌గా ఈ కార్ల రేసింగ్‌లో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై విచారణ చేయాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ ఏసీబీకి లేఖ రాయడం ఆసక్తిగా మారింది. ఏసీబీ విచారణలో ఏం జరుగుతుందోనని అటు అధికార ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సీఎస్ గ్రీన్ సిగ్నల్!
మున్సిపల్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ విచారణకు సిద్ధమైంది. అయితే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను విచారించాలంటే సర్కారు అనుమతి తప్పనిసరి. దీనితో ఎంక్వయిరీకి పర్మిషన్ ఇవ్వాలని చీఫ్ సెక్రెటరీ శాంతికుమారికి ఏబీబీ డీజీ లేఖ రాసినట్టు తెలుస్తున్నది. సాధ్యమైనంత త్వరగా ఏసీబీకి అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్. ఈ గోల్‌మాల్‌పై సీఎస్ శాంతికుమారి అరవింద్ కుమార్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. ముందస్తు అనుమతి లేకుండా రూ.55 కోట్లు ఈ-కారు రేసింగ్ నిర్వహణ సంస్థకు ఎందుకు ఇచ్చారని వివరణ కోరింది. దీనితో సీఎస్ వెంటనే విచారణకు అనుమతి ఇచ్చే చాన్స్ ఉందని సమాచారం.
టార్గెట్ కేటీఆర్?
నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో ఎవరు టార్గెట్ అవుతారనే చర్చ ప్రస్తుతం జరుగుతున్నది. నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్‌లో ఇచ్చిన ఆదేశాల మేరకే తను ఈ-కారు రేసింగ్ నిర్వహణ సంస్థకు రూ.55 కోట్లు ఇచ్చినట్టు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ నోట్ పైల్‌లో రాసినట్టు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని విచారణ సమయంలో ఏసీబీకి అరవింద్ చెప్పే అవకాశం ఉంది. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ కేటీఆర్‌ను విచారించే అవకాశం ఉంటుందని సమాచారం. నిజానికి ఈ-కారు రేసింగ్ నిర్వహణ కోసం నిధుల మంజూరు విషయంలో అరవింద్ కుమార్ రూల్స్ అతిక్రమించారు. ఆర్థిక శాఖ అనుమతి కాని సీఎస్ నుంచి పర్మిషన్ కాని తీసుకోకుండానే ఫండ్స్ రిలీజ్ చేశారు. అంతపెద్ద మొత్తంలో ఓ ప్రైవేటు సంస్థకు నిధులు ఇవ్వడం సాధారణ విషయం కాదు. అయితే ఆ సమయంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కేటీఆర్ ఒత్తిడి వల్లే అరవింద్ కుమార్ రూ.55 కోట్లను రిలీజ్ చేశారని తెలుస్తున్నది.
అసలు వివాదం ఇది..
2023 ఫిబ్రవరి-11న సెక్రెటేరియట్ పరిసరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌పై (2.8 కి.మీ.) ఈ కార్ల పోటీ జరిగింది. ఈ రేస్ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చయింది. అయితే ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో రూ.150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు ఖర్చుచేశాయి. ఇందులో ప్రభుత్వం కేవలం మౌలిక వసతులు మాత్రమే కల్పించే బాధ్యత తీసుకున్నది. రోడ్లు, ఇతర అవసరాల కోసం హెచ్‌ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. అయితే మరోసారి అదే ట్రాక్‌పై ( 2024 ఫిబ్రవరి 10న) సెషన్-10 పేరుతో ఈ-కార్ల రేసింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం (మున్సిపల్ శాఖ పరిధిలోని హెచ్ఎండీఏ) 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు మున్సిపల్ శాఖ సెక్రెటరీ హోదాలో అరవింద్ కుమార్ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించారు. కాని ముందు సెషన్‌లో కేవలం సౌకర్యాలు కల్పించేందుకు పరిమితమైన ప్రభుత్వం తర్వాత సెషన్‌లో భాగస్వామి కావడంతో వివాదం మొదలైంది. నిజానికి ప్రైవేటు సంస్థలైన గ్రీన్‌కో, ఫార్ములా-ఈనే ఖర్చులు భరించాల్సి ఉంది. కానీ, గత సీజన్‌లో పార్టనర్‌గా ఉన్న గ్రీన్‌కో సంస్థను తప్పించి, ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేవిధంగా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.
అలర్టయిన కాంగ్రెస్ సర్కార్
2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేస్ నుంచి తప్పుకొంటున్నట్లు అదే నెలలో ఎఫ్‌ఈవో ప్రకటించింది. అనంతరం ‘సెషన్-10’ రద్దయింది. ఒకవేళ ఒప్పందం మేరకు ఈ కార్ల పోటీ జరిగి ఉంటే ప్రభుత్వంపై రూ.200 కోట్ల భారం పడేదని నాడు (జనవరి 9, 2024)డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.