- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారు పూతతో బ్యాంకులకు బురిడీ.. ముఠా గుట్టు ఆలస్యంగా వెలుగులోకి
దిశ, ఖమ్మం రూరల్: ఓ ముఠా బంగారు కడియం(కడ)లకు పూత పూసి ఖమ్మంలోని పలు బ్యాంకులను బురిడీ కొట్టించి కోట్లకు మాయ చేసిన ఘటన ఖమ్మం నగరంలో జరిగింది. ఖమ్మం డీసీసీలో గత వారం రోజుల క్రితం ఈ మోసం బయట పడినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం ఖమ్మం డీసీసీబీ వారు సిబ్బందిని పిలిపించి, చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో అధికారులు ఆరా తీస్తే రుణం తీసుకున్న వ్యక్తుల అడ్రస్‌కు వెళ్లితే ఇంట్లో లేనట్లో విచారణలో తెలింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఖమ్మంలోని తన బావమరిదితో ఈ మాయకు పన్నాగం పన్నారు. అసులు ఈ మాయ.. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ బంగారు తాకట్టు పెట్టుకునే బ్యాంక్‌లో సదురు అప్రైజర్ కడియాన్ని కట్‌చేయడంతో అది నకిలీదని తేలగా ఈ విషయం బయటకు వచ్చింది. ఈ ముఠా ఖమ్మం పంజాబ్ బ్యాంక్‌ను సైతం మాయ చేసి లోన్ తీసుకున్నారు.
అలాగే ఖమ్మం నగరంలోని నాలుగు డీసీసీబీ శాఖల్లో ఈ ముఠా రుణాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన ముఠా నాయకు డు ఖమ్మం రూరల్ మండలం డాక్యా తండా, తాళ్లేసతండాకు చెందిన ఇద్దరు వ్యక్తుల తో ఈ మోసానికి పథకం రచించి, అమలు చేశారు. అమాయకులైన వ్యక్తులపై నకిలీ కడియాలను తాకట్టు పెట్టి, తాకట్టు పెట్టుకున్న వ్యక్తి రూ. వెయ్యి రుపాయలు ఇచ్చి చేతులు దులుపుకుని, లక్షలు వారు దండుకోవడం వీరి పని. దీని సూత్రధారులు రూరల్ మండలం నుంచి ఇద్దరు, ఖమ్మం నగరం నుంచి ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిసింది. ఖమ్మం నగరంలోని ఒక్క డీసీసీబీ బ్యాంక్‌లోనే ఈ ముఠా 29మంది పేర్ల మీద దాదాపు రూ.30 లక్షలకు పైగా రుణాలను తీసుకున్నారు.
బంగారం నకిలీ ఇలా..
ఈ ముఠా కేవలం కడియాలను మాత్రమే తాకట్టు పెట్టేలా నకిలీ కడియాలను తయారు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ముఠా నాయకుడు సుమారు 30 గ్రామల కడియాన్ని తయారు చేసి దానిపై మూడు లేదా నాలుగు గ్రామాల బంగారు పూత పూస్తారు. దీంతో అప్రైజర్ సైతం కనుగొనే వీలు లేకుండా ప్లాన్ చేయడంతో వారి పని సులువుగా మారింది. తాకట్టు పెట్టిన కడియానికి బంగారు రేకు కూడా తెగి రెండు ఏర్పడినట్లు బ్యాంక్ అధికారులు సైతం గుర్తించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు డీసీసీబీ అధికారులకు అందిన సమాచారం ప్రకారం.. పలు గ్రామాలకు చెందిన వారు 'తాకట్టు' మోసం లో పాల్గొన్నట్లు తెలు స్తోంది. వీరిలో కొందరు మామిళ్లగూడెం, పోలే పల్లి రాజీవ్ గృహకల్ప, కరుణగిరి, పాత ఎస్సీ ఆఫీస్ రోడ్లు, లెనిన్‌నగర్, ఏదులాపురం, చిన్న తండా, తీర్థాల సమీపంలోని డాక్యా తండాకు చెందిన వారు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. పదేళ్ల కిందట డీసీసీబీలో.. సుమారు పదేళ్ల కిందట నకిలీ బంగారం తాకట్టు పెట్టి సాక్షాత్తు డీసీసీబీకి చెందిన అప్రైజర్ తన అనుచరుల పేరుతో ఖమ్మం ప్రధాన కార్యాలయం శాఖను బురిడీ కొట్టించారు. కొంత మందిని బుజ్జగించి ఇచ్చిన రుణాన్ని రికవరీ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం(నేడు) పోలీసు స్టేషన్లలో డీసీసీబీ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
ఇతర బ్యాంక్‌ల్లో సైతం భారీ మోసం
ఈ ముఠా ఒక్క డీసీసీబీలోనే కాకుండా ఇతర బ్యాంక్‌ల్లో సైతం భారీగా రుణాల తీసుకున్నట్లు తెలు స్తోంది. ఈ ముఠాలో ఇద్దరు మహిళలు సైతం కీలకం గా పని చేసినట్లు తెలుస్తోంది. ఈ ముఠా ఖమ్మం దర్జాగా నకిలీ రుణాలు తీసుకుని ఇండ్లు, కార్లు తీసుకుని జల్సాలు చేస్తున్నట్లు తెలిసింది. బ్యాంక్ అధికారులు, పోలీసులు అప్రమత్తమై విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.