Maharashtra: కాంగ్రెస్ ఘోర పరాజయం.. పీసీసీ అధ్యక్షుడు సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |
Maharashtra: కాంగ్రెస్ ఘోర పరాజయం.. పీసీసీ అధ్యక్షుడు సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) కూటమి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పీసీసీ(PCC) చీఫ్ నానా పటోలే రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమికి సంపూర్ణ బాధ్యత తనదే అని.. అందుకే బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 145.


అయితే.. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఏకంగా 235 స్థానాల్లో విజయం సాధించింది. 49 స్థానాల్లో మహా వికాస్ అఘాడీ కూటమి నేతలు గెలుపొందారు. ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక విజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ఓటర్లు, మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed