Chada Venkat Reddy : సాధించిన విజయాల స్ఫూర్తితో పోరుబాటలో ముందడుగు : సీపీఐ నేత చాడ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-26 12:32:47.0  )
Chada Venkat Reddy : సాధించిన విజయాల స్ఫూర్తితో పోరుబాటలో ముందడుగు : సీపీఐ నేత చాడ
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో సీపీఐ(CPI) పార్టీ వందేళ్ల ప్రస్థానంలో సాగించిన ప్రజా పోరాటాల ద్వారా సాధించిన విజయాల స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రజల హక్కుల కోసం పోరుబాటలో ముందుకెలుతామని సీపీఐ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్ రెడ్డి(Chada Venkat Reddy) తెలిపారు. పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవం(100th Anniversary)సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాల పునాదులపై సీపీఐ ఆవిర్భవించిందన్నారు. భారతదేశ చరిత్రలో కమ్యూనిస్టు పార్టీది ప్రముఖ పాత్ర అని పేర్కొన్నారు. దేశంలో భూసంస్కరణలు, కార్మిక హక్కులు, అనేక సంక్షేమ పథకాలు కమ్యూనిస్టుల పోరాటల ఫలితంగా వచ్చాయని గుర్తు చేశారు. పేదలు, దళితులు, మైనార్టీలు, బలహీన వర్గాల అభ్యున్నతికి, ప్రజల హక్కుల సాధన కోసం సీపీఐ నిరంతర పోరాటాలు చేస్తోందన్నారు.

రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు నేటికి పూర్తిగా అమలు కావడం లేదని, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక రాజ్యాంగానికే ప్రమాదం వచ్చిపడిందని విమర్శించారు. మహిళలు, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. విభజన, విద్వేష రాజకీయాలలో బీజేపీ దేశ సమగ్రతకు సవాల్ గా మారిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, కార్పోరేట్ సంస్థల ఆధిపత్యం పెరిగిపోయి దేశ సంపద కార్పేరేట్ల జేబుల్లోకి వెలుతుందన్నారు. ఆయా సమస్యలపై సీపీఐ నిర్మాణాత్మక ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఏడాది పాటు సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తామని.. ముగింపు కార్యక్రమాన్ని ఖమ్మంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed