నెల్లూరు, విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్.. భారీగా పెట్టుబడులు పెట్టనున్న పారిశ్రామికవేత్తలు

by srinivas |
నెల్లూరు, విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్.. భారీగా పెట్టుబడులు పెట్టనున్న పారిశ్రామికవేత్తలు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore), విశాఖ(Visakha) ప్రజలకు పారిశ్రామికవేత్తల(Entrepreneurs) నుంచి గుడ్ న్యూస్ లభించింది. ఈ రెండు జిల్లాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)తోనే చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(TDP MLA Somireddy Chandramohan Reddy) ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్(Hyderabad Jubilee Hills) నివాసంలో చంద్రబాబును కలిసిన పారిశ్రామిక వేత్తలు నెల్లూరు, విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపైనా ముఖ్యమంత్రికి పారిశ్రామిక వేత్తలు వివరించారు. ప్రభుత్వం రాయితీలు, అనుమతులు ఇస్తే పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని సీఎంకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలను చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు, విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాల సాయం, అండదండలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story