Bangladesh: బంగ్లాదేశ్‌లో క్రైస్తవుల ఇళ్లకు నిప్పు.. క్రిస్మస్ రోజే ఘటన

by vinod kumar |
Bangladesh: బంగ్లాదేశ్‌లో క్రైస్తవుల ఇళ్లకు నిప్పు.. క్రిస్మస్ రోజే ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌(Bangledesh)లో మరోసారి మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. క్రిస్టియన్ త్రిపుర కమ్యూనిటీకి చెందిన 17 ఇళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. బందర్‌బన్‌(Bandarban)లోని సరాయ్ యూనియన్ ఆఫ్ లామా ఉపజిల్లాలో ఈ ఘటన జరిగింది. క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు చర్చికి వెళ్లిన టైంలో తమ ఇళ్లకు దుండగులు నిప్పంటించారని బాధితులు తెలిపారు. ఈ ఘటనలో 19 ఇళ్లలో 17 పూర్తిగా కాలిపోయినట్టు సరాయ్ యూనియన్ పరిషత్ చైర్మన్ ఎండీ ఇద్రిస్ వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన అనంతరం స్థానికులు నిరసన భారీ నిరసనలు చేపట్టారు. దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, ఇటీవల బంగ్లాదేశ్‌లో మతపరమైన మైనారిటీలపై హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలోనే క్రైస్తవుల ఇళ్లపై దాడులు జరగడంతో ఆందోళన నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed