PM Modi: పార్లమెంట్ సమావేశాల వేళ విపక్షాలకు ప్రధాని మోడీ కీలక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |
PM Modi: పార్లమెంట్ సమావేశాల వేళ విపక్షాలకు ప్రధాని మోడీ కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంటు(Parliament) శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి మొదలై డిసెంబరు 20 వరకు కొనసాగనున్నాయి. ఇవాళ సభలకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రధాని మోడీ(PM Modi) పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లారు. పార్లమెంట్ సమావేశాలు నిర్మాణాత్మకంగా కొనసాగాలని కోరారు. చర్చల్లో సభ్యులంతా పాల్గొనాలని సూచించారు. ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో అధికార దాహం ఉన్న పార్టీలను ప్రజలు తిరస్కరించారని అన్నారు. పడికెడు మంది కూడా లేని సభ్యులు సభను అడ్డుకుంటామని అంటున్నారని ఎద్దేవా చేశారు. సరైన చర్చ జరుగాలని ప్రతిపక్షాలను వేడుకుంటున్నట్లు తెలిపారు. కొందరు కావాలనే కుట్రపూరితంగా సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని పార్టీల్లోనూ కొత్త సభ్యులు ఉన్నారు. కొత్త సభ్యులకు సభలో అవకాశం రావాలని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 26న ఈ సమావేశాలు జరగవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ ఈ నెల 29న తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed