షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండాలా..? రెగ్యులర్‌గా ఈ డ్రింక్స్ తాగండి!

by Kanadam.Hamsa lekha |
షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండాలా..? రెగ్యులర్‌గా ఈ డ్రింక్స్ తాగండి!
X

దిశ, ఫీచర్స్: రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే కొద్ది ఆరోగ్య సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ఉన్న వాళ్లు వారు తీసుకునే ఆహార పదార్థాలు, పానియాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. బ్లడ్‌లో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగారంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దాల్చిన చెక్క డ్రింక్: ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజు తాగే టీలో కొంచెం దాల్చిన చెక్కను లేదా దాని పొడిని కలిపి తాగాలి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

దాల్చిన చెక్క, చియా సీడ్స్: ముందుగా దాల్చిన చెక్కపొడి అర టీస్పూన్, ఓ టీస్పూన్ చియా సీడ్స్ తీసుకుని అందులో కప్పు, నీరు పోసి బాగా మరిగించాలి. అందులో కొంచెం తేనెను కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పడు తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. చియా గింజల్లో గ్లెసెమిక్ ఇండెక్ తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉండేందుకు సహాయపడుతుంది.

అల్లం, నిమ్మ టీ: అల్లం, నిమ్మకాయ రెండు డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయి. గోరు వెచ్చని నీటిలో కొంచెం అల్లం రసం, నిమ్మరసం కలిపి తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. దీంతో మెటబాలిజం పెరిగి, డైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది.

పసుపు పాలు: పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. పాలలో పసుపు వేసుకుని తాగడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. పాలలో పసుపు వేసుకుని ఉదయం లేదా రాత్రి నిద్రపోయే ముందు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed