- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amitabh: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో నన్ను పోల్చొద్దంటూ అమితాబ్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్(Bollywood famous actor Amitabh Bachchan) ఇప్పటికే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Tollywood icon star Allu Arjun)పై పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ హీరో బన్నీని కొనియాడారు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ (Kaun Banega Karod Pati) అనే షోకు అమితాబ్ వ్యాఖ్యాతగా చేస్తోన్నది తెలిసిన విషయమే. కాగా ఈ 16 వ సీజన్‌లో కోల్‌కతా(Kolkata)కు చెందిన ఓ మహిళ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. పలు సీన్స్‌లో అమితాబ్ అండ్ బన్నీ మేనరిజం(mannerism) సేమ్ ఉంటుందని చెప్పుకొచ్చింది.
ఈ షో వల్ల మిమ్మల్ని చూసే చాన్స్ వచ్చిందని, ఐకాన్ స్టార్‌ను కూడా చూసే టైమ్ వస్తుంది.. అప్పుడు నా కల నెరవేరుతుందని కోల్‌కతాకు చెందిన గృహిణి వెల్లడించింది. ఆ హీరో అంటే ఆమెకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే అమితాబ్ మాట్లాడుతూ.. నాకు కూడా బన్నీ అంటే ఎంతో ఇష్టమని.. ఆ నటుడికి విరాభిమానిని అన్నారు. ఆయనకు వచ్చిన గుర్తింపులు అన్నింటికీ కూడా అల్లు అర్జున్ అర్హుడని కొనియాడారు. ఈ హీరో నటించిన పుష్ప-2 (Pushpa 2) రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని.. చూడకపోతే మీరు కూడా సినిమా చూడండంటూ అమితాబ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అల్లు అర్జున్‌తో నన్ను అస్సలు పొల్చవద్దని.. ఆయన గొప్ప ప్రతిభావంతుడని వివరించారు.