- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చలి పంజా...ఉదయం బయటకు రాని జనం
దిశ, ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రంగా పెరిగింది. గత వారం రోజుల నుంచి చలి క్రమ క్రమంగా పెరుగుతూ వస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల తేడా లేకుండా చలి ప్రజలను వణికిస్తుంది. దీంతో ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలోని కంగ్టి,న్యాల్ కల్, జహీరాబాద్, అందోల్, పుల్ కల్ సిర్గాపూర్, నాగలి గిద్ద చౌటకూర్, రాయికోడ్, ఝరాసంగం తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగింది. వాహనదారులు, వ్యాపారస్తులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాతావరణంలో మార్పులు రావడం దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వారి సంఖ్య పెరిగింది. చలికి తోడుగా ఉదయం పొగ మంచు తీవ్రంగా కురుస్తుంది.
సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండల కేంద్రంలో సోమవారం ఉదయం 8.8 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆర్ సి పురం లో 17.7 గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ లో చలి తీవ్రత తీవ్రంగా ఉండడం సర్వసాధారణమై పోయింది. కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 8.3, అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాగా సంగారెడ్డి జిల్లా కోహీర్ 8.8, న్యాల్ కల్ 9.6,కంగ్టి 9.8, గుమ్మడిదల (నల్లవల్లి) 10.0 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎం. బాలశౌరి తెలిపారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్త వహించాలని వారికి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జాగ్రత్తలు తప్పనిసరి : గాయత్రి దేవి, సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి..
జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్న వేళ దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్లు సరైన సమయానికి మందులు వేసుకోవాలి. ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు, చిన్నారులు స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్‌లు వాడాలి వేడి వేడి ఆహార పదార్థాలు, గోరువెచ్చని నీరు తీసుకోవాలి. ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా స్థానిక ప్రభుత్వ వైద్యాధికారికి సంప్రదించాలి.