- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RRR కస్టోడియల్ టార్చర్ కేసు.. సీఐడీ మాజీ అడిషినల్ ఎస్పీకి సుప్రీం షాక్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు (Deputy Speaker Raghurama Krishnaraju)ను.. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు అరెస్ట్ చేసి.. శారీరకంగా హింసించారు. 2021 మే 14న జరిగిన ఈ ఘటనపై రఘురామకృష్ణరాజు ఈ ఏడాది ఫిర్యాదు చేయగా.. జగన్ (Jagan) సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినా వినకుండా.. ఛాతీపై కూర్చుని చంపేందుకు ప్రయత్నించారని రఘురామ ఆరోపణలు చేశారు. అంతేకాదు.. తన ఫోన్ పాస్ వర్డ్ చెప్పాలని కొట్టి టార్చర్ చేశారన్నారు.
రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు (Custodial Torcher Case)లో సీఐడీ మాజీ అడిషినల్ ఎస్పీ విజయ్ పాల్ కూడా నిందితుడిగా ఉన్నారు. ఇటీవల తనపై నమోదైన కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేశారు. నేడు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. విజయ్ పాల్ కు షాకిచ్చింది. సుదీర్ఘ వాదనల అనంతరం.. తనపై నమోదైన కేసును కొట్టివేయడం కుదరదని పేర్కొంటూ.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం ఆయన పిటిషన్ ను కొట్టివేసింది.