- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tollywood: అక్కడ ఆ సినిమా జీరో ఓపెనింగ్స్.. ప్రశాంత్ వర్మ మ్యాజిక్ పని చేయలేదా?
దిశ, వెబ్ డెస్క్ : అశోక్ గల్లా (Ashok Galla) ‘హీరో’ అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఆ మూవీ ఫ్లాప్ అవ్వడంతో కొంత గ్యాప్ తీసుకుని ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) మూవీ చేశాడు. నవంబర్ 22న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. బోయపాటి శ్రీను శిష్యుడు, ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల ఈ సినిమాకి దర్శకుడు. "హనుమాన్’" మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పాపులారిటీ తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకి కథ అందించాడు. కానీ, మొదటి రోజు ఫస్ట్ షో తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రెండు రోజుల కలెక్షన్స్ ఒకసారి చూసుకుంటే..
నైజాం - 0.10 CR
సీడెడ్ - 0.01 CR
ఆంధ్ర(టోటల్) - 0.09 CR
ఏపీ + తెలంగాణ(టోటల్) - 0.20 CR
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.03 CR
వరల్డ్ వైడ్(టోటల్) - 0.23 CR (షేర్)
'దేవకీ నందన వాసుదేవ’ మూవీకి రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ, రెండు రోజుల్లో రూ.0.23 కోట్లు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. సీడెడ్ లో జీరో ఓపెనింగ్స్ రావడంతో ప్రశాంత్ వర్మ మ్యాజిక్ పని చేయలేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.