Lucky Bhaskar OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ‘లక్కీ భాస్కర్’ (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-11-25 07:28:29.0  )
Lucky Bhaskar OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ‘లక్కీ భాస్కర్’ (పోస్ట్)
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar). వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీబ, సాయి సౌజన్య నిర్మించారు. అయితే జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ‘లక్కీ భాస్కర్’ సినిమా భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

ఫస్ట్ షో నుంచి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీసును షేక్ చేసింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘లక్కీ భాస్కర్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకోగా.. స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 28 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో దుల్కర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Next Story