కర్ణాటక నుండి తెలంగాణకు నకిలీ దందా

by Sridhar Babu |
కర్ణాటక నుండి  తెలంగాణకు నకిలీ దందా
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మేడ్చల్‌ జిల్లా శామీర్ పేటలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాల ముఠాను మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. కర్ణాటక నుండి తెలంగాణలోని రైతులకు పత్తి విత్తనాలను తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు చాకచక్యంగా నకిలీ పత్తి విత్తనాల ముఠాను పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తూ అమాయక రైతులకు అమ్ముతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.

రైతులను మోసగిస్తున్న ముఠా కర్ణాటక నుండి హైదరాబాద్‌కు వస్తుండగా శామీర్‌పేట ఓఆర్ ఆర్ వద్ద ఎస్ఓటీ పోలీసులు వాహనాన్ని తనిఖీలు చేశారు. వాహనంలో పైన జొన్నలు లోపల నకిలీ విత్తనాలు 37:5 క్వింటాళ్లు తరలిస్తున్నట్లు ఎస్ ఓటీ పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకొని వాహనాన్ని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ నరేష్ ను పోలీసులు విచారిస్తున్నారు. డ్రైవర్‌ది మంచిర్యాల జిల్లా తపలాపూర్‌ గ్రామంగా పోలీసులు గుర్తించారు. అసలు ఈ నకిలీ విత్తనాల ముఠా వెనుక ఎవరున్నారు ? ఎక్కడి నుంచి వీటిని తరలిస్తున్నారు ? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Next Story

Most Viewed