- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
DCM:‘ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే కారణం అతనే’.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో ఇవాళ(గురువారం) ఎస్సీ వర్గీకరణ(Classification of SC) పై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga), ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మందకృష్ణ గుండె ధైర్యమే దానికి నిదర్శనం అన్నారు. మాదిగల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మందకృష్ణదే అని కొనియాడారు.
ఆ కులానికి వన్నె తెచ్చిన ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ(Classification of SC) పై చాలా చర్చలు జరిగాయి. గుర్తింపు లేని కులాలపై విస్తృతంగా చర్చలు జరిగాయని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ ఇచ్చిన నివేదిక చాలా అద్భుతంగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వర్గీకరణ బిల్లును మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాం. ఇది అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నా అని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు.