అభివృద్ధి పనులు జూన్ లోగా పూర్తి చేయాలి

by Sridhar Babu |
అభివృద్ధి పనులు జూన్ లోగా పూర్తి చేయాలి
X

దిశ,కంటోన్మెంట్/తిరుమలగిరి : కంటోన్మెంట్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు జూన్ లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం కంటోన్మెంట్ లో ఆశా ఆఫీసర్స్ కాలనీ నుండి రైల్వే స్టేషన్ వరకు రూ 1.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటోన్మెంట్ లో రూ.9.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకుంటున్నామని వీటిని జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కంటోన్మెంట్ నియోజవర్గంలోపెండింగ్ లో ఉన్న కమ్యూనిటీ హాల్స్, తాగునీరు, జీహెచ్ ఎంసీలోకి తీసుకొని పరిష్కరిస్తామని తెలిపారు. ఇతర సమస్యలు శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల వద్ద ఎమ్మెల్యే గణేష్ చర్చిస్తారన్నారు. నియోజవర్గ సమస్యలు పట్టించుకున్నప్పుడే మన పనికి సార్థకత ఉంటుందన్నారు.

ఆ పనిలో ఎమ్మెల్యే గణేష్ ముందుంటారు

కంటోన్మెంట్ నియోజకవర్గ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్ మున్సిపాల్టీ,మెట్రో వాటర్ వర్క్స్ నుండి ఎన్ని నీరు కావాలన్నా వాటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని తెలిపారు. ఇది కంటోన్మెంట్ లో ఉండడం వల్ల స్టోరేజ్ కి తక్కువగా అవకాశం ఉందని తెలిపారు. మెట్రో వాటర్ వర్క్స్ ,కంటోన్మెంట్ అధికారులు కలిసి సమస్య పరిష్కరించాలని కోరారు.

ఎమ్మెల్యే గణేష్ అడిగిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరుపున రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కంటోన్మెంట్లో తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. తాను చాలా సంవత్సరాలు కంటోన్మెంట్ లో ఉన్నట్టు చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రజా పాలన ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నియోజకవర్గంలో 3500 ఇళ్లు మంజూరు చేశామని అన్నారు.

టెన్త్ విద్యార్థులకు శుభాకాంక్షలు..

పదవ తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి జరగనున్నాయని, హైదారాబాద్ జిల్లాల్లో 358 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు జీవితంలో కీలకమని, తల్లిదండ్రులు టీవీ సీరియల్స్​ బంద్ చేయాలని కోరారు. పరీక్షలు రాసే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నానని, అందరూ పరీక్షలు బాగా రాయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేశ్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి , కంటోన్మెంట్ జాయింట్ సీఈఓ పల్లవి, నామినేటెడ్ మెంబర్ భానుకా నర్మద మల్లికార్జున్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed