- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral video: పరుగు మూవీ సీన్ రీపిట్.. కాళ్లు పట్టుకున్న కనికరించని కూతురు!

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్లో హిట్ సినిమాల్లో 'పరుగు (Parugu)' కూడా ఒకటి. డైరెక్టర్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా షీలా నటించారు. 2008లో వచ్చిన ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, జయసుధ, పునమ్ బజ్వా, సునీల్ కీలక పాత్రల్లో కనిపించారు. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు 30 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు. ఇక ఓ కుతూరు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది? తమ కూతురి కోసం ఎంతలా పరితమిస్తుందనేది కళ్లకు కట్టినట్లుగా ఈ చిత్రంలో చూపించారు. అలాగే, ఇంకో కూతురు కూడా అలానే చేస్తుందేమోనని ఆ తండ్రి ఎంతలా భయపడుతాడనేది, తన కుతూరిని తీసుకెళ్లకూడదని హీరోను ప్రాధేయపడుతాడనేది అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. అయితే, ఇదంతా ఇప్పుడేందుకు అనుకుంటున్నారా? తమిళనాడులో (Tamilnadu) ఇలాంటి ఓ సీన్ రీపిట్ అయింది.
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్‌గా (Viral video) మారింది. ఇందులో ఉన్న సమాచారం ప్రకారం.. ఓ అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతుంది. అయితే, అలా వెళ్లిపోకూడదని ఆ అమ్మాయి తండ్రి బ్రతిమిలాడుకుంటున్నాడు. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా ముందుకు వెళ్లిపోతున్నారు. చివరికి ఆ తండ్రి వారి కాళ్లు పట్టుకుని విజ్ఞప్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రేమించటం తప్పు కాదని, తల్లిదండ్రులు ఒప్పుకునే వరకు వెయిట్ చేయాలని కామెంట్లు పెడుతున్నారు.
పరుగు సినిమాలో దృశ్యం.. తమిళనాడు లో ప్రత్యక్షం!
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) March 22, 2025
కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్ళొదని ప్రద్యేయ పడుతున్న తండ్రి.. విడియో వైరల్#TamilNadu #Daughters #UANow #Parents pic.twitter.com/fzv51crOnO