KTR: ఇక్కడ జరిగింది.. రేపు రాష్ట్రంలో ఎక్కడైనా జరగొచ్చు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |
KTR: ఇక్కడ జరిగింది.. రేపు రాష్ట్రంలో ఎక్కడైనా జరగొచ్చు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: లగచర్ల(Lagacharla)లో తొమ్మిది నెలలుగా దళిత, గిరిజన రైతులు ఆందోళనలు చేస్తున్నారని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. సోమవారం లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్‌లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. తొమ్మిది నెలలుగా ధర్నా చేస్తున్నా.. వారితో మాట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమయం ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులను కలిసేందుకు టైమ్ లేదు కానీ.. ఢిల్లీకి వెళ్లేందుకు మాత్రం క్యూ కడుతున్నారని విమర్శించారు.

సొంత నియోజకవవర్గంలోనే సీఎం తిరుగుబాటు ఎదుర్కొన్నారని అన్నారు. సొంత అల్డుడి కోసం ముఖ్యమంత్రి పేదల భూములు లాక్కున్నాడని ఆరోపించారు. అదానీ(Adani), అల్లుడు, అన్నాదమ్ముళ్ల కోసమే రేవంత్ పనిచేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారని అన్నారు. తనను రాళ్లతో కొడతామని కొందరు ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. వారిపై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో మానుకోట రాళ్ల దాడి నుంచి నిప్పు పుట్టిందని గుర్తుచేశారు. ఆ నిప్పు నుంచే తెలంగాణ వచ్చిందని తెలిపారు. ఇవాళ లగచర్లలో జరిగింది రేపు ఇంకెక్కడైనా జరుగొచ్చు అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed