- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Big Breaking: మరికొద్దిసేపట్లో ఆర్జీవీ అరెస్ట్ ?
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ను మరికొద్దిసేపట్లో పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికలకు ముందు ఆర్జీవీ (RGV) తీసిన వ్యూహం సినిమా (Vyuham Movie) విడుదల సమయంలో.. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)లపై అనుచిత పోస్టులు పెట్టారు. దీంతో ఆయనపై ఇటీవలే ప్రకాశం జిల్లాలో టీడీపీ (TDP) నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు (Ongole Police) స్వయంగా ఇంటికెళ్లి నోటీసులిచ్చినా హాజరు కాలేదు.
ఆ తర్వాత తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి తాము రక్షణ కల్పించలేమని, పోలీసులనే అడగాలని చెప్పడంతో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైంది. దాంతో విచారణకు హాజరయ్యేందుకు తన 4 రోజుల సమయం కావాలని ఒంగోలు పోలీసులకు వాట్సప్ లో మెసేజ్ చేశారు. నాలుగు రోజులు పూర్తయినా విచారణకు రాకపోవడంతో.. పోలీసులే ఆర్జీవీ డెన్ కు వెళ్లారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇంటికి చేరుకున్న ఒంగోలు పోలీసులు.. విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Read More: RGV Advocate: సమాధానం చెప్పినా పోలీసులు ఇంటికి రావడమేంటి?