- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rahasya Gorak: అర్ధరాత్రి కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం సినిమా చూడండి.. యంగ్ హీరో భార్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’(Ka). సుజీత్(Sujith), సందీప్(Sandeep) ఇద్దరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. చింతా వరలక్ష్మి(Chinta Varalaxmi) సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి(Chinta Gopala Krishna Reddy) నిర్మాణంలో రూపుదిద్దుకుంటోంది. నయన్ సారిక(Nayan Sarika), తన్వి రామ్(Thanvi Ram) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, రెండు పాటలు, ట్రైలర్ అలరించాయి. ఇక ఈ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ బాషల్లోనూ ఈ చిత్రం విడుదల చేస్తామని ఫస్ట్ ప్రకటించిన మూవీ టీమ్.. ప్రజెంట్ తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని హీరో నాగచైతన్య ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక ఈ ఈవెంట్‌లో కిరణ్ భార్య రహస్య(Rahasya) తన భర్త ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. “క సినిమా రిలీజ్ కాకముందే సినిమా హిట్ అవుతుందని, ట్రైలర్ బావుందని అభిమానులు చెప్పడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీ అందరి ప్రేమకు నేను థాంక్స్ చెప్తున్నాను. మీ అభిమానం ఎప్పుడు మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. చాలా ఏళ్లుగా కిరణ్ ఎన్నో కష్టాలు, అవమానాలు భరిస్తూ వచ్చాడు. అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది. దాని నెరవేర్చుకోవడానికి హార్డ్ వర్క్ చేస్తాం. కానీ, దాంతో పాటు ఒక సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ సమయంలో కూడా ఆయనకు తోడు ఉన్న వారందరికీ నేను థాంక్స్ చెప్తున్నాను. క కోసం కిరణ్ చాలా కష్టపడ్డాడు. ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని, లుక్ మార్చి.. కథ కోసం ఎంతో తాపత్రయపడి చేశాడు. కిరణ్ ఇక్కడ వరకు వచ్చారంటే.. అదంతా మీ వలనే. అయితే ఈ మూవీ ఎందుకు చూడాలంటే నేను మూడు కారణాలు చెప్తాను. మొదటిది మీ కోసం చూడండి. ఎన్నో ప్రెషర్స్‌లో ఉంటారు. ఎంటర్ టైన్ అవ్వడానికి థియేటర్‌కు వస్తారు. క సినిమా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. రెండోది మా టీమ్ కోసం చూడండి. మా టీమ్ అంతా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఒక సినిమా మంచిగా వచ్చింది అంటే.. అది చిత్ర బృందం చేసిన హార్డ్ వర్క్ నే. క సినిమా కోసం చిత్ర బృందం పడిన కష్టం కనిపిస్తుంది.
ఇక మూడోది.. మా ఆయన కోసం చూడండి ప్లీజ్. కిరణ్ 'క' కోసం ఎంత కష్టపడ్డాడు అంటే.. మా పెళ్లి రోజు తప్ప మిగతా అన్ని రోజులు దానికోసమే పనిచేశాడు. అర్ధరాత్రి 2 , 3 అని తేడా లేకుండా ఏ ఆలోచన వచ్చినా లేపి.. ఇలా చేస్తే బాగుంటుంది. కథను ఇలా చెప్తే బాగుంటుంది అని ఆరాటపడేవారు. కచ్చితంగా మీకు క నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోయినా మా ఎఫర్ట్స్ కోసం ఒక్క చాన్స్ ఇచ్చి చూడండి. ఈ సినిమా చూశాకా మీరు రెండు రోజులు నిద్రపోరు.. అంత హంటింగ్‌గా మ్యూజిక్ ఉంటుంది. అక్టోబర్ 31న అందరూ థియేటర్ లోనే సినిమా చూడండి” అని రహస్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్‌లు ఆగస్టులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.