- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Aghori Mata : బెల్లంపల్లిలో అఘోరి మాత ప్రత్యక్షం..
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆకస్మికంగా అఘోరి మాత ప్రత్యక్షం కలకలం రేపింది. మంగళవారం రాత్రి ప్రత్యేక వాహనంలో కన్నాల ప్రధాన జాతీయ రహదారి పై అఘోరిమాత ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది. వాహనంలో నుంచి దిగి అఘోరి మాత రోడ్డుపైన కొద్దిసేపు ఫోన్లో మాట్లాడడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా అవాకయ్యారు. అఘోరి మాత కొద్దిసేపు రోడ్డు పక్కనే అటు ఇటు తిరుగుతూ టెలిఫోన్ లో ఎవరితోనో సంభాషించడం అందరూ ఆసక్తిగా చూశారు.
అఘోరిమాతను చూసిన కొందరు యువకులు ఫ్రూట్స్ అందజేశారు. అఘోరి మాత జాతీయ రహదారి పక్కన కొద్దిసేపు కనిపించిన వార్త దావాణంలా బెల్లంపల్లిలో వ్యాప్తి చెందింది. ఫోన్ లో సంభాషణ ముగిసిన వెంటనే అఘోరిమాత అక్కడి నుంచి తాను వచ్చిన ప్రత్యేక వాహనంలో మంచిర్యాల వైపు వెళ్ళింది. ఇటీవల సోషల్ మీడియాలో అఘోరిమాత సంచరించడం వైరల్ గా మారింది. బెల్లంపల్లిలో ప్రత్యక్షమైన అఘోరిమాత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన పై ప్రజలు చర్చించుకోవడం కనిపించింది.