Market Committee : ఆర్మూర్ మార్కెట్ కమిటి చైర్మన్ గా సాయిబాబా గౌడ్..

by Sumithra |
Market Committee : ఆర్మూర్ మార్కెట్ కమిటి చైర్మన్ గా సాయిబాబా గౌడ్..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ నియమితులయ్యారు. ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ గా విట్టం జీవన్, డైరెక్టర్లుగా సురకంటి చిన్న గంగారం, కల్లూరి చిన్న ఉషన్న, అజ్మీర పీర్ సింగ్, కనక రవికుమార్, మట్ట అమృత రావు, మామిడి చంద్రశేఖర్ రెడ్డి, సయ్యద్ ఫయాజ్, కళ్లెం మల్లారెడ్డి, పింజా ఉషారాణి, బుస మల్లయ్య, మహమ్మద్ మునీరుద్దీన్, ముత్యం సంతోష్ లు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో జారి అయిన నియామక పత్రాన్ని మాజీ మంత్రి, ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మంగళవారం సాయిబాబాగౌడ్ ఇతర పాలకవర్గ సభ్యులకు అందజేశారు. రెండు సంవత్సరాల కాలపరమతి కలిగిన మార్కెట్ కమిటీ నియామక పత్రాన్ని నూతన చైర్మన్ గౌడ్ కు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, సమక్షంలో సాయిబాబా గౌడ్ కు అందజేశారు.

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆశిష్షులతో ఆర్మూర్ మార్కెట్ యార్డ్ నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ సాయిబాబా గౌడ్ కి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాయిబాబా కూడా మాట్లాడుతూ ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హుందాన్, నుడ చైర్మన్ కేశవ వేణు, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, కౌన్సిలర్ కొంత మురళి , కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్మల్ గోపి, ఎన్ వి రవీందర్ రెడ్డి(చిట్టి) ,రాజు భాయ్ ఫాయీమ్ బాయ్, మైసిన్, ఎస్కే బబ్లు, నటరాజ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed