Prabhas Spirit Movie : మొదటిసారి ఖాకీ డ్రెస్‌లో ఆకట్టుకోనున్న ప్రభాస్.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోన్న సందీప్ రెడ్డి?

by Anjali |
Prabhas Spirit Movie : మొదటిసారి ఖాకీ డ్రెస్‌లో ఆకట్టుకోనున్న ప్రభాస్.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోన్న సందీప్ రెడ్డి?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ స్టార్ ప్రభాస్ (Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకటో, రెండో తప్ప ఈ హీరో ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లనే చెప్పుకోవచ్చు. బాహుబలి(Baahubali), సలార్(Salar) చిత్రాల గురించైతే స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు కొల్లగొట్టి మరింత ఫేమ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం రెబల్ స్టార్ రాజా సాబ్ (Raja Saab), స్పిరిట్(Spirit) చిత్రాల్లో నటిస్తున్నాడు. రాజా సాబ్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీకి కమిట్ అయిన ప్రభాస్ త్వరలోనే ట్రాక్ ఎక్కబోతున్నట్లు సమాచారం. అయితే రీసెంట్ గా సందీప్ రెడ్డి(Sandeep Reddy).. పాన్ ఇండియా స్టార్ పోలీస్ కాప్ గా కనిపించబోతున్నాడని చెప్పారు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ మొదలైంది. ఇప్పటివరకు వచ్చిన మన రెబల్ స్టార్ పోలీసు పాత్రలు వేరు.. ఇప్పుడు మనోడు చేసే మాస్ పోలీసు పాత్ర వేరు అంటున్నారు. ఈ హీరో కటౌట్‌కు తగ్గట్లు పోలీసు డ్రెస్ వేస్తే ఎలా ఉంటాడో ఫ్యాన్స్ ఊహించుకుంటూ ప్రభాస్ పోలీసు డ్రెస్ తో ఎడిట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక టీ- సిరీస్ భూషన్ కుమార్ (T-Series Bhushan Kumar) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar) మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు. ఈ మూవీకి మ్యూజికే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. మరీ పాన్ ఇండియా వరుస సినిమాలు ఏ రేంజ్‌లో ఆకట్టుకోనున్నాయో చూడాలి మరీ.

Advertisement

Next Story

Most Viewed