- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Allu Arjun: పుష్ప 2 లో అల్లు అర్జున్ తో పోటీ పడనున్న పవర్ ఫుల్ అమ్మాయి.. సుకుమార్ ట్విస్ట్ సూపర్..!
దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). బన్నీ కెరియర్లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పుష్ప 1 పెద్ద హిట్ అవ్వడంతో సీక్వెల్ భారీగానే ప్లాన్ చేశారు.
ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో రిలీజ్ అయి రూ.100 కోట్ల క్లబ్లో చేరి కొత్త రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ అల్లు అర్జున్ కి పాన్ ఇండియా క్రేజ్ ను తెచ్చి పెట్టింది. ఇప్పుడు, ఈ సినిమా సీక్వెల్ కి వరల్డ్ వైడ్ భారీ బజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 6 న రిలీజ్ అయ్యే సినిమాని ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్ కోసం డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు.
పుష్ప పార్ట్ 1( Pushpa 1) లో అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ లను విలన్లుగా చూపించారు. అయితే, ఇప్పుడు పుష్ప 2 లో మెయిన్ విలన్ ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సారి పుష్ప రాజ్ తో ఒక అమ్మాయి పోటీ పడబోతుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు.. పుష్ప-1 (Pushpa 1) లో సునీల్ కి చుక్కలు చూపించిన దాక్షాయిణి అలియాస్ అనసూయ. సుకుమార్ ఈ ముద్దుగుమ్మకు పెద్ద అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరూ ఎదురుపడినప్పుడు థియేటర్లో అరుపులే అట. మరి పుష్ప 2 (Pushpa 2)ఎలాంటి పవర్ఫుల్ విలన్ పాత్ర పోషించిందో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.