Additional Collector : ఎస్సీ,ఎస్టీ కేసులలో చట్ట ప్రకారం న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాం

by Kalyani |
Additional Collector : ఎస్సీ,ఎస్టీ కేసులలో చట్ట ప్రకారం న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాం
X

దిశ, హనుమకొండ : జిల్లా పరిధిలో నమోదైన ఎస్సీ,ఎస్టీ కేసులలో చట్ట ప్రకారం న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి ( Additional Collector ) అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదు వివరాలు, వాటి పురోగతి, తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కమిటీ సభ్యులు, పోలీస్, రెవెన్యూ అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. మానిటరింగ్ సభ్యులకు గుర్తింపు కార్డు లను అందజేస్తామన్నారు. మహనీయుల జయంతి కార్యక్రమాలను జిల్లా కలెక్టరేట్ లో నిర్వహిస్తామన్నారు. కమిటీ సమావేశంలో చర్చించిన అన్ని అంశాలను, సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, చుంచు రాజేందర్, హరి జవహర్ లాల్ నాయక్, రడపాక పరంజ్యోతి, సింగారపు రవిప్రసాద్, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ కార్యదర్శి పల్లెపాడు దామోదర్, ఓయాసిస్ సంస్థ ప్రతినిధి ప్రకాష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, ఏసీపీలు కిషోర్ కుమార్, తిరుమల్, దేవేందర్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, తహసీల్దార్లు జ్యోతి వరలక్ష్మి దేవి, బావ్ సింగ్, చల్లా ప్రసాద్, సదానందం, జగన్ మోహన్ రెడ్డి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed