బీజేపీ వాళ్ళను ఊళ్ళో తిరగనివ్వం.. ఎమ్మెల్యే

by Disha News Desk |
బీజేపీ వాళ్ళను ఊళ్ళో తిరగనివ్వం.. ఎమ్మెల్యే
X

దిశ, మహబూబాబాద్: ప్రధాన మంత్రి హోదాలో ఉండి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై చేసిన వ్యాఖ్యలు విచారకరమని మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం నిరసన తెలిపారు. వీటిలో భాగంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియపై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు అన్ని రాష్ట్రాలను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. బీజేపీ వాళ్ళను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. కేసముద్రం, నెల్లికుదుర్, గూడూరు, గార్ల, బయ్యారం మండలాల్లో టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, పరకాల శ్రీనివాస్ రెడ్డి, యాల్లా మురళీధర్ రెడ్డి, గోగుల రాజు,మర్నేని రఘు పాల్గొన్నారు.

Advertisement

Next Story